Saturday, 7 November 2026

బస్సు ద్విచక్ర వాహనం ఢీ

బస్సు ద్విచక్ర వాహనం ఢీ

కొత్తగూడ నవంబర్ 26 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలనికి సమీపంలో గాదె వాగు వద్ద నర్సంపేట డిపోకు చెందిన సాదిరెడ్డిపల్లి కోనాపూర్ బస్సు,ద్విచక్ర వాహనం ఢీ.ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలతో కాలు విరగడం జరిగింది.గాయపడిన వ్యక్తి కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న మండల రాజ్ కుమార్ గా స్థానికులు తెలిపారు.విధులు ముగించుకొని అతని స్వగృహం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టిసి బస్సు ఢీకొనడంతో తన కుడికాలు విరిగిపోయింది.వెంటనే స్థానికులు అంబులెన్స్ ఫోన్ చేసి నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.