అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 521 పరుగులకు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది, 8 వికెట్లకు 521 పరుగుల చేసిన దశలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు కెప్టేన్ ధోని ప్రకటించారు. చటేశ్వర్ పూజారా డబుల్ సెంచరీ భారత్ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. 98 పరుగులతో రెండో రోజు బరిలోకి దిగిన పూజారా ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని 206 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కడపటి వార్తలందేసరికి ఇంగ్లండ్ 4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపో కుండా 14 పరుగులు చేసింది.




