జాతిపిత విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన
-కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులకురవి జనవరి 30/ జనం సాక్షి న్యూస్: మహబూబాద్ జిల్లా కురవి మండలంలో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి ఆదేశాల మేరకు డోర్నకల్ నియోజకవర్గ బాద్యులు మాలోత్ నెహ్రు నాయక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి పిలుపు మేరకు గాంధీ వర్ధంతిసందర్భంగా రాహుల్ గాంధీ,భారత్ జోడో యాత్ర కన్యాకుమారి లో ప్రారంభం అయి కాశ్మీర్ లో ముగిస్తున్న సందర్భంగా యాత్రకు మద్దతుగా కురవి మండల కేంద్రంలో జాతీయ జెండా ఎగురవేసి మహత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కురవి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్బంగా కురవి మండల నాయకులు వద్దుల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ప్రతి ఒక్కరూ ఆయన చూపిన దారిలో వెళ్లాలని ఆయన దేశం కోసం చేసిన సేవలను కొనియాడారు.సత్యం అహింస ఆయుధాలుగా శాంతి యుద్ధాన్ని గెలవచ్చు అని నేటి యువతకి ఆయన జీవిత చరిత్ర ఒక్క సర్దార్గంలో నడవడానికి ఒక పుస్తకం లాంటిది అని ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని ఆకాంక్షించారు.గాంధీ జీవిత చరిత్ర ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచి అని అతనీ ఆలోచనలు యువకులకు ఆదర్శనీయమని గాంధీ మహాత్ములు కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని రాజకీయ నాయకులు అతని ఫోటోకు దండే వేయడమే తప్ప అతని ఆశయాలకు అండగా లేరు అని నేటి ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య పాలనకు తూట్లు పొడుస్తుంది అని, గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని ఇదేవిధంగా కొనసాగితే గాంధీ మార్గంలో ఈ ప్రభుత్వంపై ఎన్ని ఉద్యమాలు చేయడానికి వెనకాడము అని కాంగ్రెస్ పార్టీ అనిటికి సిద్ధంగా ఉందని తీవ్ర పదజాలంతో అధికార పార్టీని హెచ్చరించడం జరిగింది .అలాగే దేశ సమైక్యతకై-భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపంకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర నేటితో సుమారు 4వేల కిలోమీటర్లు విజయవంతంగా ముగించుకొని-నేడు కాశ్మీరులో ముగించుకుంటున్న నేపథ్యంలో….
యాత్రకు మద్ధతుగా,సంఘీభావంగా కాంగ్రెస్ శ్రేణులంతా ఆయా కేంద్రాల్లో జెండా ఆవిష్కరణలు చేస్తూ మద్దతు ప్రకటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీరోలు మండల బాద్యులు రంగన్న గౌడ్,కురవి మండల నాయకులు శ్యామల శ్రీనివాస్,ఎడ్ల వెంకన్న,బాదే వీరభద్రం,సీఎచ్ ముత్తిలింగాం,లక్ష్మయ్య,దీర్వత్ వీరన్న,సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుగులోత్ నవీన్,సోషల్ మీడియా సభ్యులు,బానోత్ కళ్యాణ్,బానోత్ సాయి కుమార్,నీలం రఘు,కాంగ్రెస్ అభిమానులు,కార్యకర్తలు,గ్రామ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.




