కురవి జనవరి 30/ జనం సాక్షి న్యూస్: కురవి మండలం బిబి నాయక్ తండా గ్రామ పంచాయితీ లో సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటివెలుగు కార్యక్రమనికి ముఖ్య అతిధిగా జడ్పిటిసి బండి వెంకరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రెండు విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మండల ప్రజలు మీ మీ గ్రామాలలో నిర్వహించే తేదీలలో ఈ కార్యక్రమాన్ని స్వాధివినియోగం చేసుకోవాలని, ముందు చూపుతో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ దే అని అన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బోడ శ్రీను, ఎంపీటీసీ అడిదేల దేవేందర్, గ్రామ కార్యదర్శి డి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ బుజ్జి,చంధ్య తండా సర్పంచ్ పద్మ నెహ్రు నాయక్, బంగారి గూడెం సర్పంచ్ జీవన్, గ్రామ వార్డ్ మెంబెర్స్ వీరన్న, బీ బావుసింగ్, బీ అరుణ, నగేష్, పార్వతి, పాండు, ఎమ్మార్వో ఇమ్మనియల్, ఎంపీడీవో సరస్వతి, డాక్టర్ మౌనిక,స్వాతి, సంధ్యరాణి, శైలజ,ఏఎన్ఎం భాగ్యమ్మ, శ్వేత,ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు బీ పద్మ బి సరోజ, శారదా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




