Tuesday, 3 November 2026

భారత్ జోడోయాత్ర విజయవంతం చేయాలి

భారత్ జోడోయాత్ర విజయవంతం చేయాలి
మాజీ ఉపముఖ్యమంత్రి దామోదరరాజనర్సింహ

అల్లాదుర్గం జనంసాక్షి
మండలంలోని రాంపూర్ లో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన వివరించారు ఆందోల్ నియోజక వర్గంలో తన హయాంలో జరిగిన పనులే కనిపిస్తున్నాయి తప్ప గడిచిన ఎనిమిది ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రభుత్వానికి ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తుకు వస్తాయన్నారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేషారెడ్డి, పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్, రేగోడు మండల పార్టీ అధ్యక్షులు దిగంబరావ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాం, రేగోడు జడ్పిటిసి యాదగిరి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కురుమ మహేష్ ,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు