Friday, 6 November 2026

భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మంద

భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మంద సత్యనారాయణ కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండమల్లేపల్లి నవంబర్ 26 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలో శనివారం నాడు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశ ప్రజలమైన మేము భారతదేశమును సర్వసత్తాక, సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్యాలను, అంతస్తులోనూ, అవకాశంలోనూ, సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని, దేశమగ్రతను తప్పక తీసుకువచ్చే సౌభ్రాతత్వతను పెంపొందించుటకు సత్య నిష్టాపూర్వకముగా తీర్మానించుకుని 1949 సంవత్సరంలో నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్ లో ఆమోదించబడి చట్టబద్ధం తీసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని సగర్వంగా తెలిపిన విశ్వ రత్న డాక్టర్ అంబేద్కర్ అని ప్రజలంతా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటూ దేశాభివృద్ధిలో భాగం కావాలని కోరుకుంటూ దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్యాపక బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులతో విశ్వ రత్న అంబేద్కర్ పటానికి పూలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వర్లు, కొర్ర లోక్యా నాయక్, లింగారెడ్డి, సైదా నాయక్, జగదీష్, అక్కిరెడ్డి, చంద్రయ్య, నీరజ, ఉమామహేశ్వరి, మంజుల, అశోక్, ఎన్ నరసింహ, అశోక్ రెడ్డి, సరస్వతి, కలమ్మ, నరసింహ రావు, లక్ష్మయ్య, అజహర్ అలీ, అశోక్ కుమార్, సూర్య, సీతారాం, నాగరాజు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు