నిరుపేద కార్యక్రమానికి చేయుాత
– ఓజో ఫౌండేషన్ ఇంచార్జ్ :- కుక్కల వెంకన్న
హుజూర్ నగర్ నవంబర్ 26 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని పీర్లచవిడి బజారులో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన కుంచపు పద్మ గత వారం అనారోగ్యంతో మరణించగా జరిగిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఓజో ఫౌండేషన్ సభ్యులకు తెలియజేయగా వారు ఓజో ఫౌండేషన్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న కి తెలియజేయడంతో ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘుకి తెలియజేయగా వారు సానుకూలంగా స్పందించి వారి కుటుంబనికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. వారి దశ దిన కర్మకు ఆర్థిక సాయంగా రూ. 5000 రూపాయలు ఇంచార్జ్ కుక్కల వెంకన్న చేతుల మీదగా వారి (కుమారుడు, కూతురికి) అందజేయడం జరిగిందన్నారు. అనంతరం హుజూర్ నగర్ బైపాస్ అంబేద్కర్ కాలానికి చెందిన యూత్ కి స్పోర్ట్స్ సంబంధించి క్రికెట్ కిట్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఫౌండేషన్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తం ఎన్నో సేవా కార్యక్రమలు రఘు చేయూత ద్వారా విద్యా, వైద్యం, (ఎడ్యుకేషన్) బడికి, గుడికి, దివ్యంగులకు, నీరు పేద విద్యార్థుల కు ఇలా ఎన్నో సేవా కార్యక్రమలు చేస్తున్నామని తెలియజేసారు. రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం పిలుట్ల రఘుకు ఇచ్చి ఈ హుజూర్ నగర్ నియోజకవర్గ రూపురేఖలు మార్చే విధంగా అందరం కృషి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న, సాయి విరాట్, నవీన్, వినోద్, రమేష్, మంజూర్, గోపి, ఓజో సభ్యులు నాగ , వేణు, అంజి,సునీల్,శ్రీను,బాబా,అనిల్ గౌడ్, సాయి విరాట్,అది,మధు,గోపి రాజాక్ ,నాగరాజు, సంతోష్, మధు, ఈశ్వర్ నాయక్, గ్రామస్తులు కూలీలు పెద్దలు, మహిళలు తదితరులు ఉన్నారు
నిరుపేద కార్యక్రమానికి చేయుాత




