హైదరాబాద్, సెప్టెంబరు 12 : నగరంలో వర్గం బీభత్సం సృష్టిస్తోంది. గత అయిదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టు కాలనీలో ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఇంటి ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న ఆరు కార్లు, ఐదు బైక్‌లు ధ్వంసమయ్యాయి. గోడ చాలా ఎత్తుగా ఉండటంతో గ్రానేట్ రాళ్లు పడి పక్కన ఉన్న ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపకశాఖ, పోలీసు, జీహెచ్‌ఎంసీ విభాగాల అధికారులు, సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.




