Wednesday, 4 November 2026

రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్ల రద్దు

కింద్రాబాద్‌, సెప్టెంబరు 12 : కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా వద్ద జరిగిన రైలు ప్రమాదంతో అధికారులు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. రాయచూర్‌-బీజాపూర్‌ ప్యాసింజరు, ముంబయి- సికింద్రాబాద్‌ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. ఫలక్‌నుమా- గుల్బర్గా ప్యాసింజరును పాక్షికంగా రద్దు చేశారు. ప్రమాద ఘటన వద్ద సహాయ చర్యలు చేపట్టేందుకు గుంతకల్లు నుంచి ప్రత్యేక రైలు బయలుదేరింది. రైలు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన జ్యోతి, లక్ష్మీలు మరణించారు. ఈ ఘటనలో సల్మా, రాజు, శ్రీకాంత్‌లు గాయపడ్డారు. ఈ ముగ్గురు ప్రయాణికులు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కారని అధికారులు చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *