జనంసాక్షి, కమాన్ పూర్ : ఇంటర్ ఫలితాల్లో బైపిసి గ్రూప్ లో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించిన కమాన్ పూర్ మండల ప్రభుత్వ జూనియర్ కాలేజీ రాధారపు శ్రీనిధి ని ఏఐసీసీ కార్యదర్శి దుదిల్ల శ్రీధర్ బాబు బుధవారం ఫోన్ లో విద్యార్థితో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాదరపు శ్రీనిధి ఇంటికి వెళ్లి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శీను బాబు శాలువాతో సత్కరించి, స్వీటు తినిపించి అభినందించారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంఎంపీసీ లో టెక్కo సంజన 458 /470 సాదిoచగ వారి ఇంటికి వెళ్లి శీను బాబు విద్యార్థిని శాలువతో సత్కరించి సన్మానించారు. నేటి విద్యార్థులే పునాదులని, విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో మనస్పూర్తిగా కృషి చేస్తే అనుకున్న లక్ష్యాలతో విజయం సాధిస్తారని శ్రీను బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైనాల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి బొంపల్లి రాజయ్య, గుండారం, రొంపికుంట సర్పంచులు ఆకుల ఓదేలు, కటకం రవీందర్, నాయకులు చొప్పరి శేఖర్ పిడుగు శంకర్, గడ్డం శీను, కొంతం శ్రీనివాస్, ఎండి అప్సర్, రఫిక్, పెండ్యాల రాజు, పిడుగు నరసయ్య, కుక్క రవి, కటకం నారాయణ, కమ్మ గోని మల్లన్న, సయ్యద్ ఇక్బాల్, మామిడి రాజు, బొజ్జ సతీష్ ఇరుగురాల శేఖర్, రాజు, కుశన రవి, జనగాం శేఖర్, సాయి, బిల్లా కృష్ణ, బిల్లా వెంకటేష్, బంగారు మహేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




