Wednesday, 4 November 2026

ఉపాధి హామి కూలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి – పోసన బోయిన హుస్సేన్

 

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 10 (జనంసాక్షి): ఉపాధి హామి కూలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసన బోయిన హుస్సేన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని అమరవరం గ్రామంలో వేసవికాలం మండే ఎండలో కార్మికులు కష్టం చేసి చేసిన పనికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసనబోయిన, హుస్సేన్ విమర్శించాడు. బుధవారం అమరవరం గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి కూలీలను ఉద్దేశించి హుస్సేన్ మాట్లాడుతూ చట్టపకారం వారం రోజులకు వేతనాలు చెల్లించాలని, ఉన్న నెలలు గడుస్తున్నా నేటికీ వేతనాలు చెల్లించకపోవడం అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఉపాధి చట్టంలో మంచి నీరు, టెంటు, పార, గడ్డపార సౌకర్యాలు ఉన్నప్పటికీ అవి అమలకు నోచుకోవటం లేదని అన్నారు. ఎండాకాలం ఎండలు తీవ్రంగా ఉండటంతో ఎక్కువ గంటలు పని చేయించడం వల్ల కూలీలు అనారోగ్యానికి గురై పని ప్రదేశంలో సొమ్మసిల్లి పోతున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎంపీడీవో కార్యాలయంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు షేక్. సైదా, సీతారాములు, గోపి, నరసింహారావు, సతీష్, నాగయ్య, ఉపాధి మేట్లు, కూలీలు పాల్గొన్నారు.