Wednesday, 4 November 2026

భాషా పండితులకు పదోన్నతులు కల్పించాలి.

 

 

 

 

 

వేములవాడ రూరల్, ఫిబ్రవరి 10 జనం సాక్షి : భాషా పండితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పదోన్నతులు కల్పించాలని శుక్రవారం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు జలపాల వెంకటయ్య పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర పండిత్ జాక్ పిలుపుమేరకు పాఠశాలలో 9,10 తరగతులకు గత ఎనిమిది రోజులుగా బోధన నిలిపివేసి నిరసన తెలపడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, అటు విద్యార్థులకు విద్యాబోధన సాగే విధంగా చూడాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు