భువనగిరి థియేటర్‌లో అనుమానితుడి అరెస్టు

నల్గొండ: భువనగిరి భద్రాద్రి థియేటర్‌లో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థియేటర్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పలువురు అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ కనిపించారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు అక్కడి నుంచి పరారాయ్యారు. పోలీసులు వెంబడించి ఒకరిని పట్టుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.