Wednesday, 4 November 2026

భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా యువ నాయకులు చిక్కుల వెంకటేశం ఎన్నిక

నియామక పత్రం అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన యువ నాయకులు చిక్కుల వెంకటేశం ముదిరాజ్ గారికి కాంగ్రెస్ పార్టీ భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. భువనగిరి మండలం, పట్టణ మరియు బీబీనగర్ మండలాలు బ్లాక్ కమిటీకి వర్తిస్తాయి. బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నిక అయినా యువ నాయకులు చిక్కుల వెంకటేశం గారు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు అయినా ఎన్ ఎస్ యు ఐ, విద్యార్థి సంఘాలలో గ్రామ శాఖ అధ్యక్షుల నుండి మండల ప్రధాన కార్యదర్శిగా విద్యార్థుల సమస్యల పైన పోరాటం చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ విభాగంలో రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన పార్టీ అంతర్గత ఎన్నికలలో అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా భువనగిరి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి వరంగల్లు, నల్లగొండ జిల్లాలకు యువజన కాంగ్రెస్ ఇన్చార్జిగా పనిచేయడం జరిగింది. విద్యావంతుడు అయినా చిక్కుల వెంకటేశం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని పార్టీ బలోపేతం కోసం చురుకుగా పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలలో భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది . యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు చిక్కుల వెంకటేశంకు నియామక పత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా చిక్కుల వెంకటేశం మాట్లాడుతూ తనపై నమ్మకంతో బోనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికచేసిన పార్టీ నాయకులకు మరియు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే, తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఎనముల రేవంత్ రెడ్డి గారికి యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. రానున్న రోజులలో తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ బలోపేతం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తానని భువనగిరిలో ఎమ్మెల్యే గెలుపు కోసం పాటుపడతానని కేంద్రంలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేయడం జరిగింది.
చిక్కుల వెంకటేశం ఎన్నిక పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.