Wednesday, 4 November 2026

వెట్టిచాకిరిలో పంచాయతీ కార్మికులు

 

 

 

* పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి
* జీవో ప్రకారం వేతనాలు హక్కులు సౌకర్యాలు అమలు చేయాలి
* నిరవధిక సమ్మెకు ఐఎఫ్ టియు మద్దతు

టేకులపల్లి, జూలై 7( జనం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా 12,639 గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 60 వేలమంది కార్మికులు వేతనాలు, హక్కులు, సౌకర్యాలు,8గంటల పని,మల్టీ వర్కర్ విధానంరద్దుకై గత రెండు రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్నారని సమ్మెపిలుపులో ఐఎఫ్టియు అనుబంధ తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ భాగస్వామిగా ఉందని కార్మికులంతా ఐక్యంగా సమ్మెను విజయవంతంచేసి ఫలితం సాధించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.సీతారామయ్య అన్నారు.కార్మికుల ఐక్యతను బలాన్ని దెబ్బకొట్టేందుకు ప్రభుత్వ సాగిస్తున్న కుట్రను తిప్పికొట్టాలని విజయం సాధించే దాకా పోరాటంలో కొనసాగాలని కార్మికులకు ఐఎఫ్టియు సంపూర్ణ అండదండలు అందిస్తుందని ఆయన తెలిపారు.టేకులపల్లి మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండలంలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె సందర్భంగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా వద్దకు హాజరైన సీతారామయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను బానిసలు కన్నా హీనంగా చూస్తున్నారని, వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. మల్టీ వర్కర్ విధానం ద్వారా కార్మికుల ఆత్మ అభిమానాన్ని దెబ్బతీయడమే కాకుండా అత్యంత ప్రమాదానికి గురిచేసే విధంగా ఉన్నందున వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సి ప్రకారం 15,500 నుండి 19,500 రూపాయల వరకు వేతనాలు చెల్లించాలని, యూనిఫామ్, సభ్యులు, చెప్పులు,టార్చిలైటు,నూనెలు,8 గంటల పనిదినం, ఆదివారం సెలవుదినం,పీఎఫ్, ఈఎస్ఐ, నష్టపరిహారం లాంటి డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఇల్లు లేని పేదకార�