Tuesday, 3 November 2026

భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు అరికట్టాలి: తెదేపా

హైదరాబాద్‌ : రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్న భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గస్‌పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా అపార్టీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ… వైఎస్‌ హయాంలో కృష్ణపట్నం పోర్టుకు జీవోలు లేకుండా అడ్డగోలుగా భూములు కట్టబెట్టారని విమర్శించారు. మరో ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… భూకజ్జాలపై తొమ్మిదేళ్లుగా తెదేపా పోరాడుతుందన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయన్నారు. ప్రాంతీయ ఉద్యమాల ముసుగులో కొందరు వ్యాపారులను బెదిరించి భూదందాలు చేస్తున్నారన్నారు. అవినీతి మంత్రులను ముఖ్యమంత్రి వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. గస్‌పార్క్‌ వద్ద ధర్నా అనంతరం ప్రజాప్రతినిధులంతా అసెంబ్లీ వరకూ ప్రదర్శనగా వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *