Tuesday, 3 November 2026

సచివాయలంలో రాజీవ్ శర్మ తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల సమావేశం

హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ ప్రపంచ బ్యాంకు తలుపు తట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత …ప్రభుత్వం తీసుకున్నా వివిధ పథకాలు, లక్ష్యాల సాధన కొసం వరల్డ్ బ్యాంక్ సహకారం అవసమని భావిస్తోంది. సచివాయలంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల సమావేశం అయ్యారు.ప్రపంచ బ్యాంకు చప్పుళ్లు మళ్లీ వినిపిస్తున్నాయి. సరిగ్గా విద్యత్‌ ఉద్యమ స్ఫూర్తి రగిల్చిన పదిహేనేళ్ల తర్వాత… తెలంగాణ ప్రభుత్వంతో వరల్డ్ బ్యాంక్ బృందం సంప్రదింపులకు తెరలేపింది. తెలంగాణ సీఎస్‌ రాజీవ్ శర్మ, శాఖాధిపతులతో zlgoadl4వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు సచివాయలంలో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినా తర్వాత నూతన ప్రభుత్వం తీసుకున్నా సంక్షేమ పథకాలు, వాటి తీరుతెన్నులను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు సీఎస్ రాజీవ్ శర్మ. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం లక్షన్నర కోట్ల రుణం అవసరమని ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు వరల్డ్‌ బ్యాంకుకు ప్రతిపాదించినట్లు తెలిసింది.విద్యుత్‌ రంగంలో కొత్తంగా థర్మల్ కేంద్రాల నిర్మాణం, లైన్ల ఏర్పాటు, డిస్కంల పునర్‌వ్యవస్థీకరణ తదితర అవసరాల కోసం నిధుల్ని ప్రభుత్వ వర్గాలు అడిగాయి. ఇదిలా ఉంటే గతంలో పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థలు యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్ర నిర్మాణానికి 20వేల కోట్ల రుణాన్ని ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నాయి. 11 శాతం వడ్డీకే రుణాన్ని ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అయితే తెరవెనుక ఈ సొమ్మును సమకూరుస్తోంది వరల్డ్‌ బ్యాంకేనని విశ్లేషకులు అంటున్నారు. పైకి ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా కనిపిస్తున్నా వీటి మూలాలు మాత్రం వరల్డ్‌ బ్యాంక్‌కు చెందినవిగా తేలింది.తెలంగాణలోని వివిధ శాఖల ఆర్థిక అవసరాలన్నింటినీ ప్రభుత్వ అధికారులు ప్రపంచ బ్యాంకు అధికారుల ముందు పెట్టారు. విద్య వైద్యం రహదారుల నిర్మాణం, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖ, వాటర్‌ గ్రిడ్‌, తదితరాల్లో రుణాలు కావాలని చర్చల్లో ప్రతిపాదించారు. బ్యాంక్‌ షరతులపై మాత్రం ఎవరూ నోరెత్తే సాహసం చేయడం లేదు. వరల్డ్‌ బ్యాంకు ప్రభుత్వం కోరిన లక్షన్నర కోట్ల సహాయం పై విషయంలో పథకాల సమగ్ర రిపోర్టు ను ఇచ్చినట్లయితే తమ కన్సల్టెన్సీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వానికి హమీ ఇచ్చారు వరల్డ్‌ బ్యాంకు అధికారులు.ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో జరిగిన సమావేశ వివరాలను ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలపకుండా అత్యంత గోప్యంగా ఉంచుతోంది. గతంలో చంద్రబాబు సర్కారు సైతం వరల్డ్‌ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాలను ఎక్కడా లీక్‌ చేయకుండా గోప్యంగా ఉంచింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ సర్కారు వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *