జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనపూర్ గ్రామంలో శుక్రవారం ఘనంగా శ్రీ లక్ష్మి భూ లక్ష్మీ బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠపించడం జరిగిందని సర్పంచ్ దాసరి శంకరయ్య తెలిపారు. దేవత ప్రతిష్టాపన సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి ఓగ్గు కథ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున అమ్మవార్లకు గ్రామ ప్రజలు మహిళలు బోనాలు సమర్పించుకున్నారు.





