జనంసాక్షి , మంథని : దేశానికి వెలుగులు ఇచ్చే సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికుల శ్రమకు తగ్గ సత్కారమే శ్రమశక్తి అవార్డులని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న జక్కుల దామోదర్రావుకు శ్రమశక్తి అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. మంథని లోని రాజగృహాలో అవార్డు పొందిన జక్కుల దామోదర్రావును ఆయన శాలువాతో సన్మానించి శుబాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మేడేను పురస్కరించుకుని సింగరేణి కార్మికుల శ్రమకు గుర్తింపుగా సత్కారం చేశారని ఆయన వివరించారు. సింగరేణి సంస్థ మరింత పటిష్టం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. శ్రమశక్తి అవార్డులు కార్మికుల్లో మరింత బాధ్యత పెంచుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. బొగ్గు ఉత్పత్తి పెంచి లాబాల బాటలో నడిపించాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆయన తెలిపారు. ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందుతూ సింగరేణి సంస్థను కాపాడుకుంటూ కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న దామోదర్రావుకు శ్రమశక్తి అవార్డు మరింత బాధ్యత పెంచుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది సింగరేణి కార్మికుల సేవలను గుర్తించి పెద్ద ఎత్తున శ్రమశక్తి అవార్డులు అందించిన సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డిలకు ఈ సందర్బంగా జెడ్పీ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.




