Wednesday, 4 November 2026

భూసార పరీక్ష ఆవశ్యకతపై రైతులకు అవగాహన

 

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి కిల్లా పెద్దపల్లి జిల్లా, వారు కమాన్పూర్ మండలం గొల్లపల్లి, సిద్ధపల్లి గ్రామాల్లో శుక్రవారం భూసార పరీక్ష, దాని ఆవశ్యకత మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కిరణ్ పిల్లి(మృతిక శాస్త్రవేత్త) రైతులకు భూసార పరీక్ష పద్ధతిని, మట్టి నమూనా సేకరణ పద్ధతిని, అలాగే దాని యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. వారు రైతులకు ఉచిత భూసార పరీక్ష కృషి విజ్ఞాన కేంద్రం వద్ద చేయబడునని తెలియజేశారు. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా రైతులకు మట్టి నమూనా సేకరణ కోసం బ్యాగ్స్ ని పంపిణీ చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి 100 బ్యాగ్స్ చొప్పున రెండు గ్రామాలకి కలిపి 200 బ్యాగ్స్ ని మట్టి నమూనా కోసం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ పెళ్లి (మృత్తిక శాస్త్రవేత్త ),డాక్టర్ కే అర్చన (పశు విభాగ శాస్త్రవేత్త) , ఆ గ్రామాల రైతులు పాల్గొన్నారు.