Wednesday, 4 November 2026

ఇంటి పట్టా అందజేసిన అదనపు కలెక్టర్.

 

 

 

 

 

 

నెన్నెల, మే 5, (జనంసాక్షి )నెన్నెల మండలం బొప్పారం గ్రామానికి చెందిన గంధం గోపాల్ కు శుక్రవారం మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ 58, 59 జీవో కింద మంజూరైన ఇంటి పట్టా అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ లలో ఒక్క గంధం గోపాల్ దరఖాస్తు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో 58, 59 జీవో కింద ఇంటి పట్టా మంజూరు చేశామన్నారు. అప్పుడు నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోలేని వారు, మొత్తానికే దరఖాస్తు చేసుకోని వారు ఈనెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ భూమేశ్వర్, నాయబ్ తహసీల్దార్ ప్రకాష్, గిర్దావర్ గణేష్, మండల సర్వేయర్ మణిరాజ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.