Wednesday, 4 November 2026

భూ సేకరణ ఆర్డినెన్స్‌ నష్టమేవిూకాదు: వెంకయ్య

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులందరూ సహకరించాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోరారు. ఈమేరకు ఆయన విూడియాతో మాట్లాడుతూ భూసేకరణ ఆర్డినెన్స్‌ అనివార్యంగానే తసీఉకుని వచ్చామన్నారు. చట్టం చేసే సమయం లేకనే దీనిని తీసుకుని రావాల్సి వచ్చిందన్నారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. వారికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.  అఖిలపక్ష సమావేశం సుహృద్భావంగా జరిగిందన్నారు. అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మొత్తం 42 మంది నేతలు అఖిలపక్షంలో తమ అభిప్రాయాలు చెప్పారని వెల్లడించారు. సభను సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ కు కొన్ని పార్టీలు మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. అన్ని అంశాలను చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రైతులు,పారిశ్రామికవేత్తలతో పాఉట, విదేశీ పెట్టుబడిదారులు ఈ చట్టం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అయితే రైతులకు ఎలాంటి ఘోకా ఉండదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *