Wednesday, 4 November 2026

విద్యుత్‌ ఛార్జీలపై వామపక్షాల ఆందోళన

విశాఖపట్టణం,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖలో వామపక్షాలు ఆందోళనకు దిగాయి. ఇప్పటికే వున్న ఛార్జీలను భరించలేకపోతోన్న జనాలకు మరోవడ్డన ఇబ్బందికరంగా మారిందని… ఈ నిర్ణయంపై ప్రభుత్వం తక్షణం వెనక్కు తగ్గాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు పేరుకే ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నారని, వేలాది మంది పోలీసులను మోహరించి నాలుగు గోడల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నారని విమర్శించారు. గతంలో ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు నేడు ఛార్జీల పెంపుకు నిర్ణయం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు వ్యతిరేకించి ఉద్యమాల్లోకి వస్తారని, 50యూనిట్లలోపు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేస్తున్న చేతలకు పొంతన లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *