తిరుమల,ఫిబ్రవరి23(జనంసాక్షి): తిరుమల లో టిడిపి శాసనసభ్యుడికి చెందిన బంగారు ఆభరణం చోరికి గురైంది. పుణ్యక్షేత్రమైన తిరుమలలో జి.ఎమ్.ఆర్.అతిధి గృఃహంలో దిగిన కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు బస చేశారు. ఆయన కుటుంబంతో కలిసి వరాహస్వామి ఆలయ సందర్శనకు వెళ్లిన సమయంలో చోరి జరిగింది.దొంగలు కిటీకి లోపలి నుంచి ఆభరణం చోరి చేసినట్లు భావిస్తున్నారు.దీని విలువ ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




