Wednesday, 4 November 2026

భైంసాలో నకిలీనోట్ల కలకలం.బై0సా వారాంతపు సంతలో ఘటన

 

 

 

 

 

 

బై0సా.రూరల్ ఏప్రిల్11 జనంసాక్షిభైంసా పట్టణంలో ప్రతి సోమవారం వారాంతపుసంత జరుగుతుంది. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి రైతులు కూడా ఇక్కడ కూరగాయలు అమ్మడానికి వస్తారు. అయితే సంతలో నకిలీ నోట్ల కలకలం రేపింది.సాయంత్రం 6:30 సమయంలో దాదాపు 12 ఏళ్ల ఓ బాలుడు బోకర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే కూరగాయల వ్యాపారి వద్దకి 500 రూపాయల నోటు ఇచ్చి 20 రూపాయల కూరగాయలు కొని 480 తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి మరో 500 రూపాయల నోటు తీసుకువచ్చి సేమ్ తంతు నిర్వహించాడు. నకిలీ నోటనే అనుమానం వచ్చిన కూరగాయల వ్యాపారి ఆ బాలున్ని పట్టుకునే ప్రయత్నం చేసి, విఫలమయ్యాడు. బాలుడు పరిగెత్తి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై తిరుపతి అక్కడికి చేరుకొని పరిశీలించారు. బాలుడు గురించి వివరాలు,సీసీ కెమెరాలు సహాయంతో బాలుని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇచ్చిన డబ్బులలో ఒక 500 రూపాయల నోటు నకిలీల కనిపిస్తుందని, కూరగాయల వ్యాపారి ప్రవీణ్ సహాయంతో ఈరోజు బాలుని గుర్తించె పని లో వున్నామని, బాలుడు దొరికిన తర్వాతనే పూర్తి మొత్తంలో సమాచారం దొరుకుతుందని పోలీసులు తెలిపారు.