వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 10 (జనం సాక్షి)బిజెపి రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్భన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో వారి క్యాంపు కార్యాలయంలో 27వ డివిజన్ కు చెందిన సుమారు 300 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ్మిశెట్టి క్రాంతి నేతృత్వంలో బిజెపి పార్టీలో చేరారు. మాజీ మంత్రి వర్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్ వీరికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తాం అన్నారు. తూర్పు నియోజకవర్గ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ యొక్క పరిపాలనా దక్షతకు, సంక్షేమ పథకాలకు ఆకర్షకులై యువత పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరుతున్నారన్నారు. కేంద్రప్రభుత్వ నిధులతోనే నగరం అభివృద్ధి పధంలో సాగుతుందని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి ని అధికారంలోకి తెచ్చుకొని మన నగరాన్ని అభివృద్ది చేసుకుందాం. కేసీఆర్ కుటుంబ పాలన పట్ల ప్రజలు అసహనంతో ఉన్నారు. యువతకు, నిరుద్యోగులకు కనీసం ఉపాధి అవకాశాలు కల్పించటంలేదు. కేసీఆర్ నిరుద్యోగులకు భృతి ఇస్తానన్న మాట తప్పాడు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇంతవరకు ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. స్థానిక ఎమ్మెల్యే సమస్యలను పట్టించుకోకుండ ఎంతసేపు ఆడంబరాలకు పోతూ పాలన సాగిస్తున్నాడు. దళితబందు బిఆర్ఎస్ కార్యకర్తలకే అందుతున్నదన్నారు. బిజెపి పార్టీలో చేరిన తమ్మిశెట్టి క్రాంతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తమకు సముచిత స్థానం దక్కడం లేదన్నారు. అవినీతి బిఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా బిజెపి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. బిఆర్ఎస్ ను ఎదుర్కోవడం కేవలం బిజెపి వల్లనే అవుతుందన్నారు.బిజెపి పార్టీలో చేరిన వారిలో తమ్మిశెట్టి క్రాంతి, మండల శ్రీకాంత్, గోపు అరుణ్, సలీం, బొంత శ్రీనివాస్, ముత్తినేని రాజేశ్వర్, తొగరు లక్ష్మణ్, జెట్టి విజయ్ కుమార్, గన్నెబోయిన రాజేష్, ఎస్.సంతోష్, పూరపాటి శివ, నల్ల రాజు, నల్ల రాజేంద్ర ప్రసాద్, జనగాం లింగమూర్తి, మహేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీదర్, తుల ఉమ, ఎడ్ల అశోక్ రెడ్డి, వన్నాల వెంకటరమణ, కనుకుంట్ల రంజిత్, కొల్లూరు యోగానంద్, మార్టిన్ లూథర్, ఉప్పల సురేందర్, రత్నం క్రిష్ణ కిషోర్, కందిమళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.




