Friday, 6 November 2026

భౌగోళికంగా విడిపోవటమే మిగిలింది: హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలు మానసికంగా విడిపోయారని, భౌగోళికంగా విడిపోవటం ఒక్కటే మిగిలిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణ భవిన్‌లో తెలంగాణ ల్యాబ్‌ టెక్నిషీయన్‌ యూనియన్‌ ఏర్పాటు సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని సంఘాలు విడిపోయాయని తెలియజేశారు. ఇప్పటికైనా తెలంగాణపై కేంద్రం స్పందించాలన్నారు. హిందీలో మాట్లాడే వారు ఎనిమిది రాష్ట్రాలో ఉన్నప్పుడు, తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ట్రాల్లో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. డెంటల్‌ సీట్లలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *