Tuesday, 3 November 2026

మంచినీటి కొరత లేకుండా ముందస్తు ప్రణళిక వేయాలి

హైదరాబాద్‌: వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయన ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్‌తో విడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించిరు. ఉపాధి హామి పథకం కింద పనులు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, రెవెన్యూ సదస్సుల్లో తాగునీరు, విద్యుత్‌ సమస్యలు దృష్టికి వస్తే తక్షణం పరిష్కరించాలని సీఎం చెప్పారు. నీటి ఎద్దడి నివారణకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.110 కోట్లతో , పట్టణ ప్రాంతాల్లో రూ.20 కోట్లు తక్షణం విడుదల చేసి, మరో 90 కోట్లతో ప్రణాళిక చేపట్టాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ కూలీ 149కి పెంచుతామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *