మంచినీటి సమస్యపై వైఎస్‌ఆర్‌ సీపీ ఫిర్యాదు

హైదరాబాద్‌్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని మంచినీటి సమస్యపై హెచ్‌ఆర్సీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మంచినీటి సమస్యపై సీఎం ఒక్క సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ నెల 29లోపు నివేదికి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాగు నీటి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచింది.