లింగపాలెం,జనంసాక్షి: పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో -బైక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.




