పెనుబల్లి, జూన్ 16(జనం సాక్షి)పేదలకు సాయపడే మంచి పనులతోనే మనకు మంచి పేరు వస్తుందని స్టేట్ ఇన్కమ్ టాక్స్ కమీషనర్ లావుడియ జీవన్‌లాల్ అన్నారు. పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలో శుక్రవారం మైలవరం సబ్ రిజీ స్టార్ బాణోత్ జగన్ తల్లి బాణోత్ లక్ష్మి ప్రదమ వర్ధంతి సందర్భంగా చంద్రునాయక్ మొమోరియల్ ట్రైబల్ వెల్ఫేర్ ఆద్వర్యంలో గిరిజనులకోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను , వితంతువులకు చీరల పంపిణీ , కొబ్బరిమొక్కల పంపిణీ , అన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ట్రైబల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్ధులను ఆదుకోవడం తో పాటు లంబాడ హక్కులను కాపాడటంలో చేస్తున్న కృషి ని ఆయన అభినందించారు. అనంతరం బాణోత్ లక్ష్మి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లంబాడ పౌండేషన్ రాష్ట్ర అద్యక్షులు మాళావత్ రాధాక్రిష్ణా , ప్రదాన కార్యదర్శి బాణోత్ నాగేశ్వరరావు , డాక్టర్ మట్టదయానంద్, తేజావత్ రవి తదితరులు పాల్గొన్నారు.
మంచి పనులతోనే మంచి పేరు వస్తుంది




