Wednesday, 4 November 2026

119 డివిజన్ లోవార్డు కార్యాలయంను ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణారావు,ముద్దం నరసింహా యాదవ్

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 16 ఓల్డ్ బోయిన్ పల్లి 119 డివిజన్ లోనూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయం ప్రారంభోత్సవం ను కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహా యాదవ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలను అందించడంతో పాటు సమస్యలను వేగంగా పరిష్కరించాలనే ఆలోచనతోనే వార్డు ఆఫీసులను ఏర్పాటు చేయడంజరిగిందని,ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాలలో ఉన్నకార్యాలయాలు,అధికారుల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. వార్డు కార్యాలయ వ్యవస్థతో గ్రేటర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ లో తీసుకొచ్చిన తర్వాత ఎలెక్ట్రికల్, వాటర్ వర్క్స్,టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్, ఎంట మాలజీ తదితర 11 విభాగాలకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి.వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆయా శాఖల అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు.అంతేకాకుండా ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను జిహెచ్ఎంసి అధికారులు డీసీ రవీందర్, ఈఈ గోవర్ధన్ గౌడ్, డీసీ బాలకృష్ణ, ఏఈ అరవింద రావు,వాటర్ వర్క్స్ సీజీమ్ విజయరావు, జీఎం ప్రభాకర్ రావు, మేనేజర్ తేజ,లక్ష్మణ్ యాదవ్, ఎలక్ట్రిక్ సిటీ ఏడి కృష్ణ,ఏఈ అఖిల్ మరియు అన్ని డిపార్ట్మెంట్స్ సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్,మన్నే ఉదయ్ యాదవ్,చందు యాదవ్,రాజు యాదవ్,కర్రె జంగయ్య, కర్రె లావణ్య, బల్వంత్ రెడ్డి, మక్కల నర్సింగ్, ఎజాజ్,గడ్డం నర్సింగ్ రావు,డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్,డివిజన్ సెక్రెటరీ మేకల హరినాథ్,ఎస్సీ సెల్ అధ్యక్షులు బుర్రి యాదగిరి,బీసీ సెల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్,మైనార్టీ ప్రెసిడెంట్ జాంగిర్, మహిళా ప్రెసిడెంట్ లలిత, దుర్గా,రోజా,శశికళ,దేవి,సంతోషి,పద్మలత,సుమలత,పద్మ,ఉమ,కమల, అఫీజా,బాల్రాజ్ శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి, రాజు గౌడ్,కుమార్,గణేష్,చారి, సలీం,జెకె,ఇబ్బు,ఆబిద్,షర్ఫు,మిరాజ్, కూకట్ పల్లి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, మరియు వివిధ కాలనీలకు చెందిన ప్రెసిడెంట్లు, సెక్రెటరీలు, కాలనీవాసులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.