ప్ర
భుత్వం చేసే మంచి పనులను అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్ది పేట జిల్లాలోని హుస్నాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ వికాస సమితి జిల్లా మహాసభల్లో మంత్రి పాల్గొన్నారు. 60ఏళ్లలో చేయలేని పనులను సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణను అడ్డుకుంటూ ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. రైతులు కోరితే 2013 చట్టం ప్రకారం పరిహారం ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సతీష్‌కుమార్, సోలిపేట రామలింగారెడ్డిలు పాల్గొన్నారు.
మంచి పనులను అడ్డుకుంటున్నారు




