Thursday, 5 November 2026

మంచి రోజులు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

 

 

 

 

 

 

తోట లక్ష్మీ కాంతారావుబిచ్కుంద ఏప్రిల్ 12 (జనంసాక్షి)రానున్న రోజుల్లో మంచి రోజులు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం నాడు రోజు జుక్కల్ మండలం బిజ్జాల్వాడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భాజపా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను జీఎస్టీ రూపంలో, పెట్రోల్ రూపంలో, ప్రయాణము టికెట్ల ఏదో ఒక రూపంలో దోచుకొని నామమాత్రపు అభివృద్ధి చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బిజ్జల్వాడి మాజీ సర్పంచ్ మాధవ రావు పటేల్, కథల్వాడి సర్పంచ్ నాగ్ నాథ్, బాలాజీ పటేల్ తో సమావేశమై నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ నీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. అకయ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జయ ప్రదీప్, పెద్ద ఏడ్గి సర్పంచ్ అస్పత్వార్ వినోద్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.