అల్లాదుర్గం జనంసాక్షి ఏప్రిల్ 11: భూత, ప్రేత, పిశాచ గణాలకు అధిపతిగా పిలువబడే బేతాళ స్వామి జాతర ఉత్సవాలు మెదక్ జిల్లా అల్లాదుర్గం లో వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ఏడుపాయల వనదుర్గభవానిమాత జాతర తర్వాత జరిగే అతిపెద్ద జాతర బేతాలస్వామి జాతర రాష్ట్రంలోనే మొదటి బేతాళ స్వామి ఆలయంగా ప్రసిద్ధి గాంచిన అల్లాదుర్గం బేతాళస్వామి జాతర ఉత్సవాలకు పొరుగు జిల్లాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు వస్తారు . బోనాలు, గండజ్యోతి తో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు స్వామివారిని నమ్ముకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడి ప్రజల ప్రగాడ విశ్వాసం ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఎడ్ల బండ్లతో ప్రదర్శనలు నిర్వహించారు. అల్లాదుర్గం మరియు చుట్టు పక్కల గ్రామాలనుండి సుందరంగా రంగు రంగు లతో అలంకరించిన ఎడ్ల బండ్లు భక్తులకు ఆకట్టు కున్నాయి. బండ్ల ముందు బాజా బజంత్రీలు, ఆట పాటలతో నృత్యాలు చేస్తు బేతాలుడి గుడి చుట్టూ ఊరేగించారు. జాతరకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ ,ఐ ప్రవీణ్ రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారువేలాదిగా తరలివచ్చిన భక్తులతో జాతర ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది




