పెన్ పహాడ్ ఏప్రిల్ 14 (జనం సాక్షి) : మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంపీపి నేమ్మాది బిక్షం,తహసీల్దార్ శేషగిరి రావు, ఇంచార్జి ఎంపీడివో బాణాల శ్రీనివాసు, ఎస్సై శ్రీకాంత్ గౌడ్,అంబెడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, అదేవిదంగా ప్రధాన కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహా ప్రతిష్ట కమిటీ,ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఒగ్గు సోమన్న,దాసరి శ్రీనివాస్,కత్తి రవీందర్, గద్దల వెంకన్న, చలిగంటి పుల్లారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, అనంతారం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బారి ర్యాలీ నిర్వహించి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంగం ఆధ్వర్యంలో యువకుల చేత రక్తదాన శిబిరం నిర్వహించారు జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, తహసీల్దార్ శేషగిరిరావు, ఎంపీటీసీ మామిడి రేవతి పరంధాములు, పంచాయితీ కార్యదర్శి జీడిమెట్ల రాజేష్ మహిళలు యువకులు పెద్దలు పార్టీలకు అతీతంగా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు అదేవిదంగా నాగులపాటి అన్నారం, అన్నారం బ్రిడ్జి, లింగాల,దూపహాడ్, అనాజీపురం,దోసపహాడ్ఆయా గ్రామాల సర్పంచులు మాచరం ఐకేపీ సెంటర్ వద్ద మహిళా ఆధ్వర్యంలో ఎంపీపి నేమ్మాది బిక్షం అంబెడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్, పిఎసిఎస్ చైర్మన్ నా తల జానకి రామ్ రెడ్డి సర్పంచ్ రమణ దేవయ్య, ధనియాకుల సత్యనారాయణ, మురళి మనోహర్, నకిరికంటి వెంకన్న శోభన్ , రాంబాబు నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు…




