మండల కమిటీ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీని పటిష్ట పరుస్తాం
* మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్య దేవా నాయక్
టేకులపల్లి, డిసెంబర్ 25( జనం సాక్షి ):నూతనంగా నియమించబడిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్య దేవా నాయక్ విలేకరులతో మాట్లాడుతూ వారం రోజులలో మండల కమిటీని ఏర్పాటుచేసి మండలంలో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి పటిష్ట పరుస్తామని అన్నారు. టేకులపల్లి మండలంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని, ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్కువ అని ఆది నుండి జరిగే ఎన్నికలలో టేకులపల్లి మండలం కంచుకోటగా ఉండేదని, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారే ఇతర పార్టీలకు వలసలుగా పోతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ క్షీణించలేదని, ఆ పార్టీని బలోపేతం చేయడానికి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి సత్తా చూపించడానికి ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పనిచేయడానికి మండల కమిటీ ఆధ్వర్యంలో అందరినీ కలుపుకుపోతూ కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం, టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవడం తప్పు లేదని, కానీ పార్టీ సూచించిన వారిని గెలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా కంకణ బద్దలు అవ్వాలని ఆయన సూచించారు.




