అత్యున్నత విలువలకు ప్రతిరూపం వాజపేయి.
-బిజెపి మండలాధ్యక్షులు పందిరి భీమేష్.
-ఘనంగా మాజీ ప్రధాని జన్మదిన వేడుకలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్25(జనంసాక్షి):
దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ,అత్యున్నత విలువలకు ప్రతిరూపం అని పెద్దకొత్తపల్లి భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు పందిరి భీమేష్ అన్నారు.ఆదివారం మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి జన్మదిన వేడుకలలో భాగంగా బిజెపి ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు సాతాని శ్రీను ఆధ్వర్యంలో పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు ప్రయివేటు ఆసుపత్రులలో వృద్దులకు మరియు గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం పార్టీ మండల కార్యాలయంలో వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పదిరభీమేష్ మాట్లాడుతూ వాజ్ పాయ్ మంచి వ్యక్తిత్వం, రాజకీయ ఆజాతశత్రువు, మచ్చలేని మహా నాయకుడు, భారత రత్న, గొప్ప రచయిత అని అన్నారు.దేశాభివృద్ధి కోసం అనేక మంచి నిర్ణయాలు, సంస్కరణలు చేసిన నేత అని, ప్రత్యర్థి పార్టీ నేతల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న నేత అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు శేఖర్,శివ రాజు, శివ,విజయ్,లక్ష్మణ స్వామి తదితర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.




