జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన వైనాల రాజును కిసాన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి జూలపల్లి లోని రాజు నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైనాల రాజుకు స్వీట్ తినిపించి శాలువా కప్పి సన్మానం చేశారు. ఆయన వెంట మంథని కాంగ్రెస్ నాయకులు ఐలి ప్రసాద్, బండారి ప్రసాద్ తదితరులు ఉన్నారు.




