ఏర్గట్ల ఏప్రిల్ 27 (జనంసాక్షి)నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ అధికారి రాయుడు తిరుమల ప్రసాద్ అధికారులతో కలిసి నువ్వు,సజ్జ పంటలను మొన్న కురిసిన వర్షం కు మరియు ఈదురు గాలులకు నేలకొరిగిన పంటలను గురువారం పరిశీలించారు. అనంతరం వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులకు జరిగిన పంట నష్టం వివరాలను సేకరించాలని ఏ ఈ ఓ లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నర్సింగ్ దాస్,భీంగల్ డివిజన్ వ్యవసాయ అధికారి మల్లయ్య,ఎంపిపి ఉపేందర్‌రెడ్డి,జెడ్పిటిసి గుల్లె రాజేశ్వర్, సర్పంచ్ గుల్లే లావణ్య గంగాధర్, రైతుబంధు మండల అధ్యక్షులు సున్నపు అంజయ్య, మండల వ్యవసాయ అధికారి ఎండి అబ్దుల్ మాలిక్, తాసిల్దార్ బింగి జనార్ధన్, ఏఈవోలు స్నేహ, సచిన్,రైతుబంధు గ్రామ అధ్యక్షుడు బద్దం ప్రభాకర్, పిఎసిఎస్ ఏర్గట్ల చైర్మన్ బర్మా చిన్న నర్సయ్య,ఉద్యానవన శాఖ అధికారి రోహిత్, సుమన్, రైతుబంధు సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.




