మండల ప్రజా పరిషత్ కార్యాలయము, మండల ప్రజా పరిషత్ కార్యాలయము, కంటి వెలుగు కార్యక్రమ ఏర్పాట్లను పరిశిలి౦చిన జిల్లా సహాయక పాలనాధికారి (శిక్షణ) లెనిన్ వస్టల్ టోపో వీణవంక జనవరి 13 (జనం సాక్షి ) వీణవంక మండలంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కంటి వెలుగు అంధత్వ నివారణ కోసము ఈ నెల 18 నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతము చేయాలని జిల్లా సహాయక పాలనాధికారి (శిక్షణ) లెనిన్ వస్టల్ టోపో అన్నారు . ఈ నెల 18 నుంచి 100 రోజులపాటు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లను పరిశిలి౦చారు ప్రతి గ్రామపంచాయతీలో ప్రజలందరూ పాల్గొనేలా విస్తృత ప్రచారం చేసి అందర్నీ భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని తెలిపినారు.ఈ కార్యక్రమము కోసము ప్రతి గ్రామ పంచాయతీలో అన్ని ఏర్పట్లు పూర్తి చేయాలని తెలిపారు మండలంలోని వీణవంక గ్రామపంచాయతీలో దళిత బంధు పథకం కింద మొదటి విడత మంజూరైన యూనిట్లను పరిశీలించి వారికి మంజూరైన పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పలు సూచనలు చేసినారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సహాయక పాలనాధికారి (శిక్షణ) లెనిన్ వస్టల్ టోపో మండల ప్రత్యేక అధికారి పవన్ కుమార్ డిప్యూటి సిఎవో .శ్రీనివాస్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె,ప్రభాకర్ మండల పంచాయితీ అధికారి వైద్యసిబ్బంది , మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తోపాటు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మండల ప్రజా పరిషత్ కార్యాలయము,




