Wednesday, 4 November 2026

మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

 

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 7 (జనంసాక్షి): మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సిపిఎం హుజూర్ నగర్ మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అమరవరం గ్రామంలో ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వరి కోతలు మొదలయ్యి పది రోజులైనా నేటికీ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఒకపక్క ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానలు వచ్చే ప్రమాదం ఉందని కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి వెంటనే మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు గిట్టుబాటు ధర అందించి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే ఐకెపి కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు షేక్ సైదా, బుద్ధి, బాల సైదులు, రైతులు తోట సైదయ్య , గురుస్వామి, సైదిరెడ్డి, రమణ ,లక్ష్మమ్మ , వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు