మిర్యాలగూడ, జనం సాక్షి. అంధత్వ నివారణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కంటి వెలుగు కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం సాధించిందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కోటి మందికి పైగా కంటి పరీక్షలు జరిగిన సందర్భంగా దామచర్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కంటే వెలుగు కార్యక్రమంలో శుక్రవారం నాడు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమంతా అందత్వ నివారణ అనే నినాదంతో జనవరి 18న సీఎం కేసీఆర్ ప్రారంభించిన రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం కోటి మందికి చేరిందని, మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 1 లక్ష 53 వేల 655 మందికి కంటి పరిక్షలు నిర్వహించగా 38 వేల 689 మందికి కంటి అద్దాలను పంపిణి చేసారన్నారు., అనంతరం సి.ఎం సహాయ నిధి ద్వారా దామరచర్ల మండల వ్యాప్తంగా 24 మందికి మంజూరు అయిన 10 లక్షల 94 వేల రూపాయల విలువ గల చెక్కులను లబ్దిదారులకు పంపిణి చేసారు, ఈ కార్యక్రమంలో డి.సి.ఎం,ఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బందు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, జడ్పీటీసీ లలిత-హతిరం, ఎంపీపీ ధీరావత్ నందిని-రవితేజ, మైనారిటీ నాయకులూ యూసుఫ్, ఖాసిం, మండల కో ఆప్షన్ సభ్యులు నాగుల్ మీరా, దామరచర్ల మండల ప్రధాన కార్యదర్శి దారగని వెంకటేశ్వర్లు, పడిగాపాటి పెద కోటిరెడ్డి, ఎం.పీ.టీ.సీ సోము సైదిరెడ్డి, బాల లక్ష్మి సత్యనారాయణ, సర్పంచ్లు లింగారెడ్డి, బాల శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.




