Tuesday, 3 November 2026

మండల స్థాయి సమీక్షా సమావేశం హుజూర్ నగర్

 మార్చి 9 (జనంసాక్షి): హుజూర్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా పంచాయతీ అధికారి ఎన్. యాదయ్య ఆధ్వర్యంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచినీటి సరఫరా, ఇంటి పన్నుల వసులు , మన ఊరు మనబడి కార్యక్రమం, నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం , సీసీ చార్జెస్ చెల్లింపు , ట్రాక్టర్ ఈఎంఐ , ఉపాధి హామీ పనులు , లేబర్ మొబలైజేషన్ , నర్సరీ బ్యాక్ ఫిల్లింగ్ , షేర్ నెట్లు , మండల స్థాయి ఉన్నటువంటి విభాగాల మీద సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శాంతా కుమారి , మిషన్ భగీరథ డి ఈ, డిప్యూటీ తాసిల్దార్ , మున్సిపల్ కమిషనర్, ఎస్ఐ, పంచాయతీరాజ్ ఏఈ సాయి కుమార్ , ఎంఈఓ సైదా, ఎంపీఓ మౌలానా , మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ ఆపరేటర్లు సాయి లక్ష్మి, ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.