Tuesday, 3 November 2026

విద్యుత్తు మోటార్ల దొంగలను పట్టుకున్న పోలీసులు

 

 

 

 

 

నేరేడుచర్ల (జనం సాక్షి )న్యూస్ : నేరేడుచర్ల లో గురువారం వ్యవసాయ విద్యుత్తు మోటార్ల దొంగలను పట్టుకొని ఐదు విద్యుత్తు మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు నేరేడు చర్ల ఎస్ఐ ఎం నవీన్ కుమార్ తెలిపారు. పాత నేరేడుచర్ల కు చెందిన గోలి సైదులు, పోరెడ్డి నాగేందర్ రెడ్డి నేరేడుచర్ల పట్టణానికి చెందిన షేక్ మదర్ సాబ్ లు నేరేడుచర్ల, జానల దీన్నే, మిర్యాలగూడ మండలం యాదగిరి పల్లి గ్రామ శివారులలో రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం కాలువలు,బావులు, చెరువులకు పెట్టుకున్న విద్యుత్ మోటార్లను తమ జల్సాలకి డబ్బు కోసం రాత్రి వేళలో మొత్తం ఐదు మోటార్లను దొంగతనం చేసినట్లు ఎస్సై చెప్పారు. పాత ఇనుము షాపులో మోటార్లను అమ్మటానికి ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకొని మోటార్ల తో పాటు మోటార్ సైకిల్, కటింగ్ ప్లేయర్, యాక్సా బ్లేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.