Wednesday, 4 November 2026

మంత్రిపై ఆరోపణలు నిరూపించేందుకు సిద్ధం – మాజీ ఎం.పీ.పొన్నం

హైదరాబాద్‌, (మార్చి4): మంత్రి జగదీష్‌రెడ్డిపై తాను చేసిన ఆరోపణలు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ ఎం.పీ. పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. కమిటీ వేస్తే తన వద్ద ఉన్న పక్కా ఆధారాలు బైట పెడతానని ఆయన ప్రకటించారు. మంత్రి అవినీతిపై ప్రజాకోర్టులోనే తేల్చుకుంటానని ప్రభాకర్‌ అన్నారు. జగదీష్‌రెడ్డి అవినీతికి పాల్పడలేదని సీఎం కేసీఆర్‌ చెప్పగలరా అని ప్రభాకర్‌ ప్రశ్నించారు. రాజయ్యకో న్యాయం, జగదీష్‌రెడ్డికి మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *