Wednesday, 4 November 2026

మంత్రివర్గ ఉపసంఘం సమావేశం వాయిదా

హైదరాబాద్‌: బోధన రుసుము చెల్లింపులు, ఫీజు విధానంపై ఈ సాయంత్రం జరగాల్సిన మంత్రివర్గ  ఉపసంఘ సమావేశం వాయిదా పడింది. ఫీజు ఎంతో తెలియకుండా ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలను ప్రకటించడం వల్ల తలెత్తే ఇబ్బందుల పై సర్కారు ఇప్పటికే న్యాయసలహ కోరింది. అడ్వకేట్‌ జనరల్‌ నుంచి దీనికి సంబంధించిన నివేదిక అందనందున   సమావేశం వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రేపటి సమావేశంతో పాటే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసే అంశాన్ని ఉపసంఘం పరిశీలిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *