హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తమకు అందిస్తున్న పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగులు బుధవారం రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నివాసాన్ని ముట్టడించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వికలాంగులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దాంతో పలువురు వికలాంగులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.




