Tuesday, 3 November 2026

తాలిబన్ల దాడిలో ముగ్గురు భారతీయులు మృతి

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లో మంగళవారం ఒక అతిథిగృహంపై జరిగిన తాలిబన్ల దాడిలో ముగ్గురు భారతీయులు మరణించారు. వారు దుబాయ్‌కి చెందిన ఒక గెస్ట్‌హౌన్‌లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అక్కడ అన్ని భవనాలకు బంకర్లు ఉంటాయని అయితే దాడి జరిగిన సమయంలో భవనంలోని వారు బంకర్లవరకూ చేరుకునే లోపే కాల్పులకు బలయ్యారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో మూడున్నర వేల మంది భారతీయులు పనిచేస్తుండగా కొంతమంది ఎంబసీలో నమోదు చేసుకోని వారు కూడా ఉన్నారని, ఈ దాడిలో మృతి చెందినవారు అలాంటివారేనని అందుకే సమాచారం చేరవేయడంలో ఆలస్యం అవుతోందని అధికారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *