మంత్రి గంగులకు నకిలీ ఇడి నోటీసులు
హైదరాబాద్,అగస్టు25(జనంసాక్షి):మంత్రి గంగుల కమాలకర్ కు గుర్తు తెలియని అగంతకులు నకిలీ ఈడీ నోటీసులు పంపించారు. ఆయన సోదరులను అరెస్ట్ చేస్తామని నకిలీ నోటీస్ పంపారు. అరెస్ట్ వద్దనుకుంటే ఈడితో మాట్లాడి సెటిల్ చేస్తామంటూ నోటీసులో తెలిపారు. దీంతో మంత్రి గంగుల ఈడి అధికారులను సంప్రదించారు. నకిలీ ఈడి నోటీసుపై హైదరాబాద్ సైబర్ కైమ్ర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగంతకులపై 420,468,471 కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో బాగంగా గంగులకు సైబర్ కైమ్ర్ పోలీసులు ఫోన్ చేశారు. అయితే ఇప్పటి వరకు నకిలీ ఈడి నోటీస్ పై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.